
– విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగి మన దేశానికి పునరంకితం కావాలి
– ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్ సి ఓ మోతే రాజ్ కుమార్
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : విద్యార్థులు శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకోవాలని,ఎన్నో ఆవిష్కరణలకు మన ప్రాచీన భారతీయ శాస్త్రీయ విజ్ఞానమే పునాదులు వేసిందని బీసీ గురుకులాల ఆర్ సి ఓ మోతే రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం కమలాపూర్ బీసీ గురుకుల బాలుర పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ సమస్యలకు గల పరిష్కార మార్గాలతో ప్రదర్శించిన వర్కింగ్ మోడల్ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సైన్స్ ఎగ్జిబిట్లను బిసి గురుకులాల ఆర్ సి ఓ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ డా. తాడూరి రవీందర్ తో కలిసి పరిశీలించారు.
సివీ రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు మన ప్రాంతం నుంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎదిగిన శాస్త్రవేత్తలు భారతదేశానికి సేవ చేసేందుకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. సైన్స్ డే సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులు తయారుచేసిన 130 సైన్స్ ఎగ్జిబిట్లను ఆసక్తిగా గమనించి విద్యార్థులను, సైన్స్ ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఏటీపీ మంగ, ఉపాధ్యాయులు శ్రీవాణి, ఎస్.విజయ్ కుమార్, రేణుక,దీప, సైన్స్ ఉపాధ్యాయులు ఎం. సుమలత, ర్యాకం శ్రావణ్, అబ్దుల్ రషీద్, పల్లె రమేష్, చల్లూరి నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
…………………………………………