 
                * ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డికి
*సివిల్ సప్లైయీస్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎంతో కాలంగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులకు కేబినెట్ హోదాగల నామినేటెడ్ పదవులు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను అప్పజెప్పారు. కాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లైయీస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. అజారుద్దీన్ ను కేబినెట్ తీసుకున్న నేపధ్యంలో వీరిద్దరికీ నామినేటెడ్ పదవులు కేటాయించారు. మిగిలి ఉన్న ఖాళీల్లో కొత్త వారిని తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
…………………………………………………………………………………………

 
                     
                     
                    