
* రాజేంద్రనగర్లో విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మద్యానికి బానిస అయిన ఓ మహిళ భర్త మందు తాగొద్దు అని వారించినందుకు ఆత్మహత్య మనస్తాపానికి గురై ఆత్మ హత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కిస్మత్పురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిస్మత్ పురాలో శేఖర్ అరుణ అనే దంపతులు కిస్మత్ పురలో నివాసం ఉంటున్నారు. భర్త శేఖర్ కష్టపడి పని చేసుకుంటూ ఉండగా భార్య అరుణ మద్యానికి అలవాటు పడింది. మద్యం తాగొద్దని ఎన్ని సార్లు వారించినా అరుణ మద్యం తాగడం మానుకోలేదు. ఈ క్రమంలో బుధవారం అరుణ మద్యం సేవిస్తూ ఉండగా శేఖర్ వారించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. యధావిధిగా శేఖర్ బుధవారం పనికి వెళ్లడంతో మనస్తాపానికి గురైన అరుణ మద్యంలో ఎలుకల మందు కలుపుకొని తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అరుణ ను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అరుణ మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………..