* కర్ణాటక మంత్రి సంచలన కామెంట్లు
ఆకేరు న్యూస్, డెస్క్ : మోదీ-అమిత్ షా.. అనుమతి ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్తా.. ఆత్మాహుతి దాడి చేస్తా.. అంటూ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ దాడులకు పాకిస్తాన్ కారణమని ప్రపంచమంతా నమ్ముతోంది. నాటి నుంచి భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తూ భారత్ చర్యలు చేపడుతోంది. దేశంలో ఉన్న పాకిస్థానీయులందరూ దేశం విడిచిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ ఏర్పడిన తరుణంలో కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (Ahmad khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఎల్లప్పుడూ భారతదేశానికి శత్రువేనని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడమే కాదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుమతిస్తే ఆత్మాహుతి బాంబుతో పాకిస్థాన్ తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమేం భారతీయులం. హిందుస్తానీలం. పాకిస్థాన్ కు మనతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదు. పాకిస్థాన్ ఎప్పుడూ మనకు శత్రుదేశమే… మోదీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం నన్ను అనుమతిస్తే నేను పాకిస్తాన్ వెళ్లి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకొక ఆత్మాహుతి బాంబు ఇవ్వాలని ప్రధాని మోదీ(MODI), అమిత్ షా(AMITHSHA)లను కోరుతున్నాను. దాన్ని నా శరీరానికి తగిలించుకుని పాకిస్థాన్ వెళ్లి వారిపై దాడి చేస్తా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
………………………………………………….
