
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నం వరకు చాలా ప్రాంతాల్లో ఎండ భగ్గుమంది. ఎండకు జనం బయటకు రాక రాజధాని హైదరాబాద్ (Hyderabad) రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అయితే సాయంత్రం 4.30 తర్వాత వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 22 జిల్లాలకు ఆరెంజ్, ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
…………………………………………..