
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా సన్ ప్రీత్ సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సన్ ప్రీత్ సింగ్ 2011ఐపిఎస్ బ్యాచ్ కు చెందినవారు. 2012 సంవత్సరంలో ములుగు ఏ. ఎస్పీ, వరంగల్ రూరల్ ఓఎస్డిగా పని చేశారు. అనంతరం ఎల్.బి నగర్ డిసిపీ గాను, ఎస్పీగా జగిత్యాల్లో పనిచేశారు. ప్రస్తుతం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ బదిలీ అయినారు.
………………….