
* 47వ డివిజన్లో పర్యటించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి
* అధికారులకు పలు సూచనలు
ఆకేరు న్యూస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 47వ డివిజన్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,నగర మేయర్ గుండు సుధారాణి,బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ తీ కలిసి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.గోకల్ నగర్ లోని తిరుమల బార్ జంక్షన్ పనులతో పాటు డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు వేగవంతంగా,నాణ్యతతో పూ్ర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి సుధాకర్ రెడ్డి సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఈ ఈ రవి కుమార్ డి ఈ సారంగం టి పి ఎస్ లు రోజా రెడ్డి శ్రీకాంత్ ఏ ఈ మేనకా తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..