Supreme Court
* సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీం నోటీసులు
*”రిటైర్డ్ జడ్జితో ‘SIT’ దర్యాప్తుకు డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అలాగే ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ నిర్ణయాల తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) లో తీవ్ర విచారణ జరిగింది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షంగా, ఎన్నికల సంఘం వ్యవస్థాత్మక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘానికి మరియు ఇతర సంబంధిత వర్గాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
* SIT విచారణ జరపాలని పిటిషనర్ డిమాండ్..
పిటిషనర్లు తమ పిటిషన్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Supreme Court విశ్రాంత న్యాయమూర్తి (Retired Judge) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, జ్ఞానేష్ కుమార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేదా సంప్రదింపులు లేకుండానే ముసాయిదా మరియు ఇతర కీలక ప్రక్రియల్లో సీఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు.
* విధుల నుంచి సస్పెన్షన్..
విచారణ పూర్తయ్యే వరకు జ్ఞానేష్ కుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన తీసుకున్న అక్రమ ఆదేశాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్లపై ప్రాథమిక వాదనలు విన్న అనంతరం, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత చాలా కీలకమని వ్యాఖ్యానించింది.
ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దేశ రాజకీయ వర్గాల్లోనూ, చట్టపరమైన వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
