
సుప్రీంకోర్టు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎన్‌సిఆర్ నుంచి వీధి కుక్కలను తొలగించి, వాటిని షెల్టర్ హోమ్‌లలో శాశ్వతంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. మునుపటి ఉత్తర్వులో కొన్ని సవరణలు చేస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీధి కుక్కలపై దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విధానాన్ని చర్చించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పార్టీలుగా చేర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ తర్వాత వీధి కుక్కలను షెల్టర్ల నుంచి రిలీజ్ చేయాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడం నిషేధించాలని పేర్కొన్నది. వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు నిర్దేశిత ప్రదేశాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని పేర్కొంది. విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను, రేబిస్ ఉన్నవాటిని షెల్టర్లలోనే ఉంచాలని పేర్కొన్నది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టవద్దు స్పష్టం చేసింది.
………………………………….