
*అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు…
*నివాళులర్పించనున్న రేవంత్ , చంద్రబాబులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ అగ్రనేత సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని కేర్ ఆస్పత్రి నుంచి పార్టీ కార్యాలయం ముఖ్దూం భవన్ కు తరలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సురవరం సుధాకర్ రెడ్డిని చివరి సాతిగా చూసేందుకు భారీ సంఖ్యలో సీపీఐ అభిమానులు,కార్యకర్తలు,నాయకులు వచ్చే అవకాశం ఉన్నందున్న మధ్యాహ్నం మూడు గంటల వరకు ముఖ్దూం భవన్ లోనే ఉంచి ఆ తరువాత గాంధీ ఆస్పత్రి వరకు అంతిమ యాత్ర నిర్వహించి గాంధీ ఆస్పత్రికి పార్థివ దేహాన్ని అందజేస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర నిర్వహించేందకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ రానున్న చంద్రబాబు
సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్దూం భవన్ వెళ్లి సురవరం సుధాకర్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా నివాళులర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
…………………………………………..