
* అధికార లాంభనాలతో వీడ్కోలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ అగ్రనేత పాట్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర పార్టీ కార్యాలయం ముఖ్దూం భవన్ వద్ద ప్రారంభం అయింది. అంతకు ముందు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కామ్రేడ్ అమర్ రహే అంటూ సీపీఐ కార్యకర్తలు నాయకుల నినాదాలు చేశారు. ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు ధరించిన కార్యకర్తలు వివిధ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.తమ నాయకుడిని తుది సారిగా వీడ్కోలు పలికారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని సాయంత్రం గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు.
……………………………..