
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సీపీఐ అగ్రనేత,సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (SURAVARAM SUDHAKAR REDDY)అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సీపీఐ తెలంగాణ రాష్ఱ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (KUNAMNENI SAMBASHIVA RAO) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అంతిమ యాత్ర వివరాలను ఆయన వివరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కేర్ హాస్పిటల్ నుంచి
భౌతికకాయాన్ని పార్టీ ఆఫీస్ ముఖ్దూం భవన్ (MUKDHOOM BHAVAN) కు తరలిస్తారని తెలిపారు. పార్టీ ఆఫీస్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రముఖులు,అభిమానులు పార్టీ నాయకుల సందర్శనార్థ ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అంతిమ యాత్ర మొదలవుతుంది.పార్టీ ఆఫీస్ నుంచి గాంధీ మెడికల్ కాలేజి (GANDHI MEDICAL COLLEGE) కి అప్పగిస్తారు.ఊరేగింపుకంటే మందు అధికారిక లాంఛనాలతో గౌరవ సూచకంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి( CM REVANTH REDDY)తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (VENKAIAH NAIDU) హాజరయ్యే అవకాశం ఉందనిపేర్కొన్నారు. అంతిమ దర్శనానికి వచ్చే నాయకులు కార్యకర్తలు ఎర్రచొక్కాలు,ఎర్ర చీరలు ధరించి అంతిమయాత్రలో పాల్గొనాలని కూనంనేని సాంబశివరావు కోరారు.
……………………………………..