
* సహస్ర హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : కూకట్పల్లి పరిధిలో పదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఉంటున్న బిల్డింగ్‌లోనే అద్దెకు ఉంటున్న సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక సహస్ర హత్య తరువాత సంజయ్ అక్కడకక్కడే తిరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ అనుమానంతో సంజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా చంపేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దుండగుడు ఇంట్లో చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి ఉంటాడని.. తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………….