
* అంగన్వాడీ కేంద్రాలు దేశంలోనే నంబర్ వన్‌గా ఉండేందుకు కృషి చేయాలి
* ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిడిపివోల సమావేశంలో
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, హనుమకొండ: బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిడిపివోలు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ లతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా సంక్షేమ అధికారులు, సీడీపీవోలు, ఇతర అధికారులతో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషన్ పక్వాడ కార్యక్రమాన్ని అనితా రామచంద్రన్, కాంతి వెస్లీ లతో కలిసి ప్రారంభించిన్నట్లు పేర్కొన్నారు . బాల్య వివాహాలు జరగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలు వయసుకు తగినట్లుగా సరైన బరువు, ఎత్తు ఉంటున్నారా లేదా అంగన్వాడి కార్యకర్తలు చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్నటువంటి ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. బాలమృతాన్ని పిల్లలు ఇష్టంగా తినడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సిడిపిఓలు, అంగన్వాడి కార్యకర్తలు, కాయాలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు . అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లల్లో ఎదుగుదల ఉండేలా చూసుకోవాలని, చిన్నారుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని మళ్లీ వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామని అన్నారు. కొత్తగూడలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించగా ఆ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాలలో అనేక సదుపాయాలను కల్పిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాల గురించి ప్రజలకు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు.
అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టిక ఆహారంతో
పాటు యూనిఫామ్స్, స్కూల్ బుక్స్, ఆట వస్తువులు..
అంగన్వాడి కేంద్రాలలో ఏమీ ఉండవనే భావనతో చిన్నారులను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు యూనిఫామ్స్, స్కూల్ బుక్స్, ఆట వస్తువులను ఇస్తున్నామని , అయినా డబ్బులు పెట్టి ప్రైవేట్ పాఠశాలలకు చిన్నారులను పంపిస్తున్నారని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాలను గురించి గ్రామస్తులకు అంగన్వాడీ కార్యకర్తలుతెలియజేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఆహ్వానించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలను సందర్శించినప్పుడే గ్రామస్తులందరికీ అక్కడ సదుపాయాల గురించి తెలుస్తుందన్నారు. అంగన్వాడి కేంద్రాల వద్దకు వచ్చే బాలింతలు, గర్భిణీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే విధంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలన్నారు . అంగన్వాడి కేంద్రాలలో కచ్చితంగా తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ సదుపాయాలు ఉండాలన్నారు. ఈ మూడు సదుపాయాలు లేని అంగన్వాడి కేంద్రాలను గుర్తించి వీలైనంత త్వరగా వాటిని కల్పించాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల పనితీరు బాగుందని అన్నారు. దేశంలోనే మన అంగన్వాడి కేంద్రాలు, చిన్నారులు నెంబర్ వన్ అనే విధంగా పనిచేయాలన్నారు. పేదవాళ్లే అంగన్వాడి కేంద్రాలకు వస్తున్నారని అన్నారు. వాళ్లకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటలు పాటల ద్వారా విద్యాబుద్ధులు అందించాలన్నారు. సమ్మర్ హాలిడేస్ విషయమై కూడా చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కేంద్రం, రాష్ట్రం నుండి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోనూ వివాహా వయసు రాని బాలికలకు అక్కడక్కడ వివాహాలు జరుగుతున్నాయ ని, అలాంటి వాటిని పూర్తిగా నిర్మించాలన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్దిష్ట ప్రణాళికతో బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయో దృష్టి సారించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివాహాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా కృషి చేయాలి. పిల్లల్లో వైకల్య సమస్యలు ఉన్నట్లయితే వారిని గుర్తించాలన్నారు. పిల్లల్లో వైకల్య సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు క్లినికలుగా వైద్యుల ద్వారా గుర్తించే విధంగా తోడ్పాటు అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, తదితర అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. సౌకర్యాలు లేని చోట్లా ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నారు. 2025-26సంవత్సరానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల గురించి సీడీపీవోలు, జిల్లా సంక్షేమ అధికారులు సమీక్ష చేసి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, వరంగల్ ఉమ్మడి జిల్లా సంక్షేమ అధికారులు, సిడిపివోలు పాల్గొన్నారు.
……………………………………………..