
* క్రిమినళ్లు ఎప్పుడూ భయపడరు
* తెలంగాణకు నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సత్కరిస్తా
* మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అని సీఎం రేవంత్ (Cm Revanth) అన్నారు. క్రిమినల్స్ ఎప్పుడూ భయపడరని, భయపడితే క్రైమ్ చేయరని అన్నారు. అందుకే కేటీఆర్ (Ktr)కూడా భయపడబోరని చెప్పారు. కిషన్ రెడ్డి (Kishanreddy)తానే మెట్రో తెచ్చా అంటున్నారని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణకు కిషన్ రెడ్డి నిధులను తెస్తే సన్మానిస్తానని తెలిపారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రాలేదన్నారు. మనోహర్‌లాల్ ఖట్టర్ (Manoharlal Khattar) హైదరాబాద్ వస్తే, ఈటల వచ్చారు కానీ కిషన్ రెడ్డి రాలేదన్నారు. భట్టి సమాచారం ఆలస్యంగా ఇచ్చారని అనుకుందామని, మరి ఖట్టర్ కూడా సడెన్ గా వచ్చారా అని మీడియాతో చిట్ చాట్ తో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
…………………………………………………