ఆకేరు న్యూస్,తమిళనాడు: తమిళనాడుకు చెందిన ఐశ్వర్య మరియు సుష్మిత. ఒకరు IAS మరొకరు IPS.ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నేడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వీరు, 2004లో సంభవించిన సునామీ వల్ల సర్వం కోల్పోయారు. కళ్లముందే ఆస్తిపాస్తులు కొట్టుకుపోయినా, ఆ కుటుంబం ధైర్యం కోల్పోలేదు. ముఖ్యంగా వారి తల్లి తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. అమ్మ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పేదరికాన్ని సాకుగా చూపకుండా ఈ ఇద్దరు సోదరీమణులు తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు.కష్టపడి చదివిన పెద్దమ్మాయి ఐశ్వర్య, 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 44వ ర్యాంకు సాధించి ఐఏఎస్ (IAS) అధికారిణిగా ఎంపికయ్యారు. అక్క సాధించిన విజయం చిన్నమ్మాయి సుష్మితలో మరింత కసిని పెంచింది. అదే బాటలో పయనిస్తూ సుష్మిత, 2022లో 528వ ర్యాంకుతో ఐపీఎస్ (IPS) అధికారిణిగా తన కలను నెరవేర్చుకున్నారు.లక్ష్యం ఏదైనా క్రమశిక్షణ లేనిదే సాధించడం అసాధ్యమని వీరు నిరూపించారు. కష్టకాలంలో కూడా నైతికతను వీడకుండా పెంచిన తల్లి పెంపకమే వారిని ఈ స్థాయికి చేర్చింది.సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా, జీవితంపై ఆశ కోల్పోకుండా పోరాడారు.”నేను చేయలేను” అని సాకులు వెతుక్కునే వారికి ఐశ్వర్య, సుష్మితల కథ ఒక నిదర్శనం.
………………………………………………………………
