
ఆకేరు న్యూస్ డెస్క్ : భారీ వర్షం.. రోడ్లు జలమయం.. కుంగిన రోడ్డు.. అకస్మాతుగా కూరుకుపోయిన ట్యాంకర్ .. గాయాలతో భయటపడ్డ డ్రైవర్, క్లీనర్.. అధికారుల సహాయక చర్యలు.. రోడ్డుకు మరమ్మతులకు సంబంధిత విభాగాల చర్యలు… ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలో ఓ రోడ్డు ఆకస్మికంగా కుంగిపోయింది (road suddenly sank). ఆ సమయంలో ఆ దారిన వెళుతున్న ఓ భారీ ట్యాంకర్ ఆ గోతిలో ఆకస్మికంగా పడిపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను స్థానాంతరం చేశారు. రహదారి మరమ్మతులకు సంబంధిత విభాగాలు చర్యలు చేపట్టాయి.
………………………………………