
* పాడైపోయిన, కుళ్ళిపోయిన పండ్లను, కాలంచెల్లిన ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులు స్వాధీనం
ఆకేరున్యూస్, హన్మకొండ: హన్మకొండ, బాలసముద్రం, ఏకశిలా పార్క్ సమీపంలోని Barista Juce houseలో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, కుళ్ళిపోయిన, పాడైపోయిన పండ్లను వాడుతూ.. కాలంచెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ జ్యూస్ తయారు చేస్తున్న,అమ్మకానికి సిద్ధంగా నిల్వచేసిన దాదాపు 19 రకాల, సుమారు 21,420 రూపాయల విలువ గల ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మహా నగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత,పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలనే గట్టి నిర్ణయంతో వరంగల్ పోలీసు కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు,టాస్క్ఫోర్స్ ఎ.సి.పి మధుసూదన్ ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి .బాబులల్ తన సిబ్బంది తో క్రిష్ణావు రాజేందర్ నడుపుతున్న Barista Juce house anu juce తయారీ మరియు డిస్ట్రిబ్యూషన్ షాపు లో వరంగల్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి.బాబులాల్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సంయుక్తంగా దాడి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, కుళ్ళిపోయిన పండ్లు, కాలంచెల్లిన ఆహార పదార్థాలను వాడుతూ తయారు చేసిన అమ్మకానికి సిద్ధంగా, పాడైన ఉన్న దాదాపు 19 రకాల సుమారు 21,420/- రూపాయల విలువ గల ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ క్రిష్ణావు రాజేందర్ S/o జగదీశ్ యాదవ్, 37 years, యాదవ్, business r/0 H.No:1-8-336, బాలసముద్రం ,హన్మకొండ గారిని ప్రాపర్టీ తో పాటు తదుపరి చర్య నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించారు.
వ్యాపారస్తులకు పోలీస్ వారి హెచ్చరిక..
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా,కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తప్పవు, ప్రముఖ బ్రాండ్లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచాం. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని ఫుడ్ సేఫ్టీ శాఖ సహాయంతో వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి.బాబులాల్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేణు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………………..