ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలో సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడిలో 9 మంది పేకాటరాయుళ్లను పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. వీరాల్లోకి వెళితే… శివునిపల్లి నుండి పాలకుర్తి వెళ్లే రోడ్డు కు ఎదురుగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాడుతున్నట్లు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించింది. ఈ దాడిలో కుమ్మరి దేవేందర్, తోట రమేష్, దేవరపల్లి అశోక్, మాసరపు మహేందర్, ఆరూరి సురేష్, ఆరూరి సురేష్, తోట అఖిల్, గాండ్ల మహేందర్, షేక్ ఫైఈజ్, కనికట్టు నాగరాజులను పేకాడుతుండగా పట్టుకుని వారి వద్దనుండి రూ.38 వేల 490లు. స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
* తప్పించేందుకు బేర సారాలు
సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో పట్టుబడిన 9 మందిని తప్పించేందుకు స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పోలీసులతో భేరసారాలు చేస్తున్నట్లు తెలిసింది. పేకాడుతుండగా పట్టుకున్న 9 మంది పేర్లతో టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానిక ఎస్ హెచ్ ఓ కి ఫిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారా ? లేదా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి కేసు నమోదు కాకుండా వదిలి వేస్తారనేది ప్రస్తుతం శివునిపల్లి హలో చర్చ నియంగా మారింది. ఇదెలా ఉంటే మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కూడా పేకాట రాయుళ్లు, గంజాయి సేవకుల నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
