ఆకేరు న్యూస్, కరీంనగర్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య మరోసారి ధ్వజమెత్తారు. ఆయనను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయన స్పీకర్ కు ఇచ్చిన అఫిడవిట్‌పై రాజయ్య స్పందించారు. రామా.. కృష్ణా.. అంటూ జపించుకోవాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడని, తాను కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని గతంలో అనేక సార్లు స్వయంగా ప్రకటించిన ఆయనే ఇప్పుడు మాట మార్చడం దురదృష్టకరమన్నారు. బీఆర్ ఎస్ పార్టీ పై గెలిచి పార్టీని, ఆ పార్టీ కార్యకర్తలను మోసం చేసిన శ్రీహరి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కడియం నీతిమాలిన మాటలతో సభ్య సమాజం సిగ్గుపడుతోందని, సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
…………………………………………
