ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విమానంలో ప్రయాణిస్తూ ఎయిర్ హోస్టెస్‌తో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన సాఫ్ట్ వేర్ ఎయిర్ హోస్టెస్ తో అనుచితంగా ప్రవర్తించాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. కేరళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శంషాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అతడిపై బీఎన్ ఎస్ 74,75 సెక్షన్ల కింద నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
………………………………………………
