* టీఎల్ ఎం మేళాలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
ఆకేరు న్యూస్, జగిత్యాల : రోజురోజుకు సాంకేతికత వేగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య అందించే విధంగా ఉపాధ్యాయులు బోధిస్తేనే విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థులకు తరగతి గదులలో సులభతరంగా బోధన చేసేలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. వెనుకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా రీడింగ్, రైటింగ్ లకొరకు టిఎల్ఎం వినియోగించు కోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రతీ మండలం నుంచి 10 మంది బెస్ట్ టీఎల్ఎం ల ద్వారా 200 ప్రదర్శనలు ఇచ్చారని, స్టేట్ లెవెల్ ప్రదర్శనకు జిల్లా నుంచి 8 మందిని ఎంపిక చేసి పంపిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజా గౌడ్, జిల్లా సమగ్ర శిక్ష కో-ఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
…………………………………
