
* మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
*ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం
ఆకేరు న్యూస్ డెస్క్ : రాబోయే రోజుల్లో తెలంగాణ ఆయిల్ ఫామ్ హబ్ గా మారనున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంట నూనెలు దిగుమతి చేసుకోకుండా ఆయిల్ ఫామ్ సాగుతో స్వయం సమృద్ధి సాధించవచ్చన్నారు.ప్రతి ఏటా లక్ష కోట్ల రూపాయలు విలువ గల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఎరువులు ఎక్కువగా వాడితే క్యాన్సర్ లాంటి జబ్బులు ఎక్కువగా వస్తాయని అన్నారు. రైతులు ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ రైతుల అనుభవాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………