
* ఏడాది కాలంలోనే రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు
* హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ (One Trillion)ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. తాము ప్రతి రోజూ బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో, గత సంవత్సరం సంతకం చేసిన ఎంఓయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోందని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ (Hyderabad)నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నామన్నారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్(Number one)గా నిలిచామన్నారు. తమ దగ్గర అత్యధిక ఏఐ, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయని చెప్పారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తామని ముందు చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరు అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్ ఆగదని ప్రజలు అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను మొదట తెలంగాణ రైజింగ్(Telangana Rising), హైదరాబాద్ రైజింగ్ (Hyderabad Rising)అని చెప్పినప్పుడు కొందరికి కచ్చితంగా తెలియదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందని ఆనందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. తాము ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఆసియాను నిర్వహించామని, ఇవాళ హెచ్‌సీఎల్‌లో ఉన్నామని తెలిపారు.
………………………………………….