* ఉత్కంఠభరితంగా శాసనసభ సమావేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు జనవరి మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలకు హాజరుకానుండటమే. గత కొన్ని సమావేశాలకు ఆరోగ్య కారణాలు, ఇతర కారణాలతో దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ సభకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
……………………………….

