* రియల్ ఎస్టేట్‌కు 9 వేలకు పైగా ఎకరాలు
* గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం భారీ స్కాం చేస్తోందని బీజేపీ (Bjp) కీలక నేతలు ఆరోపించారు. ఈమేరకు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హిల్ట్ ద్వారా భారీ కుంభకోణం జరిగే అవకాశం ఉందని గవర్నర్ (Governor) దృష్టికి తీసుకెళ్లారు. గతంలో చాలా తక్కువ ధరలకు పరిశ్రమల కోసం భూములు ఇచ్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandar Rao) తెలిపారు. ఇప్పుడు శివార్లలో ఎకరం వందల కోట్లు పలుకుతోందని అన్నారు. ఈ లెక్కన పరిశ్రమలకు చాలా తక్కువ ధరలకు రియల్టర్లు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. 9 వేలకు పైగా ఎకరాలను రియల్ ఎస్టేట్(Real Estate) గా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందనేది పక్కన పెడితే, ఈ విధానం వల్ల నడుస్తున్న పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ నేతలు రామచంద్రరావు, మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
…………………………………………………..
