
* మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ..
* కాళేశ్వరం విజిలెన్స్, NDSA రిపోర్ట్ పై మంత్రి వర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
* పవర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీల పైనా చర్చించే అవకాశం..
* ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్..
* ఒకటి లేదా రెండు డీఏ లపై ప్రకటన..?
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారనేదాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది..ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పెండింగ్ లో ఉన్న డీఏల విషయంలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనాప్రభుత్వం పెండింగ్ లో ఉన్న డీఏల విషయమై ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.నిజానికి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పెండింగ్ డీఏల విషయమై ప్రకటిస్తారని భావించారు.. అలాగే ఉద్యోగుల సాధారణ బదిలీల విషయమై గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతారనే ప్రచారం జరుగుతోంది.. ఇకఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్బీఐ మాజీ చీఫ్ అమెరికానుంచి స్వదేశం తిరిగి రావడంతో ఈ వ్యవహారం పై క్యాబినెట్ చర్చించేయవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ తో పాటు పలు ముఖ్యమైన అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
………………………………………………..