
* స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన వచ్చే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ (Cabinet Meeting) కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే తొలి కేబినెట్ భేటీ ఇది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే, గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharala) ప్రాజెక్టుపై వివాదాలు నడుస్తున్న వేళ.. దీనిపై కూడా చర్చించనున్నారు. గోదావరి జలాలపై ఏపీతో, కేంద్రంతో నడుచుకోవాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును చర్చలకు ఆహ్వానించే అంశంపైనా చర్చిస్తారని సమాచారం. అలాగే సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
…………………………………………….