* 3834 గ్రామాలు, 27, 628 వార్డుల్లో రేపు పోలింగ్
* మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్ ఈసీ రాణి కుముది
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. 3834 గ్రామాలు, 27, 628 వార్డుల్లో పోలింగ్ చేపట్టేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకు మొదలై మధ్నాహాం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అనంతరం అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఉప సర్పంచులను ఎన్నుకునే ప్ర్రక్రియ ఉంటుందని తెలిపారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఎన్నికల సమయంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8.2 కోట్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అల్లర్లకు తావులేకుండా అధికారులకు, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్ ఈసీ కోరారు.
……………………………………
