* అంతర్జాతీయ స్థాయి.. అత్యున్నత ప్రమానాలతో ఏర్పాట్లు
* అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 8, 9 రెండు రోజులు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించిన లోగోను అధికారులు విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయిలో.. అత్యున్నత ప్రమానాలతో ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై మొదటి రోజు వివరించనున్నారు. రెండో రోజు తెలంగాణ భవిష్యత్, దార్శనికత, ప్రణాళికలు పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు వసతి సదుపాయాలు కల్పించే పనిలో నిమగ్నమయ్యారు.
……………………………………………………….
