ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో జీపీ కార్యదర్శులకు పెండింగ్‌లో ఉన్న రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలను అర్ధం చేసుకొని నిధుల విడుదలపై స్పందించడం సంతోషంగా ఉందని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
………………………………………..
