
* జల విద్యుత్ లో ముందడుగు
* రాష్ట్రానికి ఆర్థికంగా మేలు : భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జల విద్యుత్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌తో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఒప్పందం చేసుకుంది. ఒప్పందం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka), అధికారులు శిమ్లా చేరుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌తో ఒప్పందం గొప్ప ముందడుగు అని భట్టి అన్నారు. విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ విస్తరణలో ఈ ఒప్పందం కీలకమన్నారు. జల విద్యుత్ ఒప్పందంతో రాష్ట్రానికి ఆర్థికంగా మేలు జరుగుతుందని వివరించారు. బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బూట్) విధానంలో ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్ (Himachalapradhesh) ప్రభుత్వం ప్రతిపాదించిన జల విద్యుత్ ప్రాజెక్టుల్లో 400, 120 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్రాజెక్టులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంప్రదించింది. బూట్ విధానంలో 22 జల విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇటీవల హిమాచల్ ప్రభుత్వం తెలంగాణకు ప్రతిపాదనలు పంపింది. ఈమేరకు తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
…………………………………………..