
* సామాజిక న్యాయం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
* ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Session) ప్రారంభమయ్యాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రసంగం కొనసాగించారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని గవర్నర్ వెల్లడించారు.
తెలంగాణ పురోగమనమే కాదు.. రూపాంతరం చెందుతోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు 149.63 కోట్ల ఉచిత బస్సు ట్రిపులను కల్పించామన్నామన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు 5005.95 కోట్లు ఆదా అయ్యాయయన్నారు. ఇందిరా మహిళాశక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సహాయం లక్ష్యమన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల పేదల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామన్నారు. 43 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. మహిళల చేతికి 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణ అప్పగించామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారిత అన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు అగ్రశేణి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా ఆశావహుల కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తెచ్చినట్లు గవర్నర్ తెలిపారు. ఘనమైన సంస్కృతికి తెలంగాణ నిలయమన్నారు. సామాజిక అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని చెప్పారు. తెలంగాణ రైతులు రాష్ట్రానికి జీవనాధారామని, రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందని తెలిపారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని చెప్పారు. రూ.2 లక్షల పంట రుణమాఫీని అమలు చేశామన్నారు.
తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సాకారానికి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతోందని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సహా అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం వంటి వారని, రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందని తెలిపారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకితభావానికి నిదర్శనమని అన్నారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
……………………………………….