
ఆకేరు న్యూస్, కమలాపూర్: మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హైదరాబాద్ సంస్థానానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా విముక్తి లభించిందని అన్నారు.
ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జయంతి వేడుకలను మండల బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ చాయ్ వాలా నుంచి భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోడీ అని, దేశ, విదేశాల ప్రజలకు ఆదర్శనీయుడని, కరోనా సమయంలో చాలా దేశాలు ఆర్థికపరంగా, అల్లర్లపరంగా అట్టుడుకుతుంటే అగ్రరాజ్యాలు సైతం చేతులెత్తేసిన సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ ను ఎగుమతి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు కట్కూరి అశోక్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి వలిగే సాంబారావు,భూపతి ప్రవీణ్,జిల్లా నాయకులు తుమ్మ శోభన్ బాబు,బండి కోటేశ్వర్,పెండ్యాల ప్రభాకర్ రెడ్డి,చెరుపల్లి రతన్,చెట్టి సుందరయ్య,మేడిపల్లి రాజు, పెండ్యాల తిరుపతిరెడ్డి,కానుకుంట్ల బ్రహ్మచారి,దండ బోయిన శ్రీనివాస్, పి ఆర్ శంకర్,కందాల బాబురావు, శంకర్,మొగిలి, రవీందర్,రాజు, సంపతు, ఆనందం, సురేష్, రాంబాబు కుమారస్వామి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….