
* రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉగాది పర్వదినం వేళ ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు కీలక అంశాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి(Ravindrabharathi)లో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. మయన్మార్, థాయలాండ్ బ్యాంకాక్ వంటి దేశాలను భూకంపాలు కకావికలం చేస్తున్న వేళ పిడుగులాంటి వార్త వెల్లడించారు. అప్పుడప్పుడు తుపాన్లు, భూకంపాలు పలకరించవచ్చునని అన్నారు. అలాగే, ఆశాజనకమైన అంశాలూ వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పాలన సాగిస్తారని చెప్పారు. ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanthreddy)పాలన సాగిస్తారని అన్నారు. ప్రజలకు నచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఈ ఏడాది ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుందని.. ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో సమస్యలు వస్తాయనన్నారు. వాటిని సీఎం పరిష్కరిస్తారని చెప్పారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhattivikramarka), మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ(KOnda surekha), సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..