* ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణకు అత్యంత కీలకం
* అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కృష్ణా జలాల్లో 2015 నుంచి తెలంగాణలో 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు తీసుకునేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిచేయాలని మేం వచ్చాక విపరీతంగా పోరాడుతున్నామని వెల్లడించారు. పాలమూరు – రంగారెడ్డిపై బీఆర్ఎస్ హయాంలో రూ.26,262 కోట్లు ఖర్చు చేసి, 32 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారని అన్నారు. ఇంకా 39 వేల ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉందని తెలిపారు. బీఆర్ ఎస్ హయాంలో సేకరించిన భూమి కేవలం 175 ఎకరాలు మాత్రమే అన్నారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై బీఆర్ ఎస్ 1,250 కోట్లు చేసిందన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాత్రం రూ.41 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఏడాదిలోగా కృష్ణా నీటిపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణకు అత్యంత కీలకమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2017లో డీపీఆర్ ఇచ్చారని, 2022లో పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించారు. బీఆర్ ఎస్ హయాంలో కృష్ణా నదీ జలాలను ఏపీ 1200 టీఎంసీలను తరలించుకుపోయిందని వివరించారు. త్వరలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వస్తుందని, వాదనలకు తాను హాజరవుతున్నా అన్నారు. కృష్ణా జలాల్లో 814 టీఎంసీల నీటిని తెలంగాణ, ఏపీకి కేటాయించాలన్నారు. తెలంగాణకు 72 శాతం వాటా కావాలి అనికేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డిపై బీఆర్ ఎస్ ది మోసం, దగా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును ఒరిజినల్ డిజైన్లోనే పూర్తి చేస్తామన్నారు.
……………………………………………………

