ఆకేరు న్యూస్, డెస్క్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం నిజామాబాద్, ఆర్మూర్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని, ఇప్పటికే 85 శాతం మంది అర్హులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంత దూరమో, మజ్లిస్ (AIMIM) కూడా అంతే దూరమని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
…………………………………….
