ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో కోర్టు ఆదేశాలను స్పీకర్ దిక్కరించారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఏడుగురికి ఇటీవల స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏలేటి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ అంశంలో సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఏలేటి పిటిషన్ను ఇదే అంశంలో బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తో జతచేస్తూ విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
……………………………………………….
