* అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
* బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఘనస్వాగతం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేత రాంరెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. మరోవైపు పెండిరగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్‌లు ముట్టడిస్తారనే సమాచారంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అలాగే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోవడంతో మంత్రివర్గంలో అలజడి మొదలైనట్టు సమాచారం.. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార పక్షం అప్రమత్తమైనట్టు సమాచారం. కాగా, అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా జ్యుడీషియరీ క్యాడర్ నుంచి వచ్చిన అధికారి అసెంబ్లీ కార్యదర్శి హోదాలో శాసనసభను నడిపించబోవడం విశేషం. ఇప్పటివరకు అసెంబ్లీ క్యాడర్ అధికారులే ఈ బాధ్యత నిర్వర్తించేవారు.
……………………………………………..

