ఆకేరున్యూస్ డెస్క్: పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతి శని, ఆదివారాల్లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడికి ప్రాచుర్యం కల్పించేందుకు హైదరాబాద్- వరంగల్- రామప్ప గుడి టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్లో ఉదయం 6.30 గంటలకు యాత్రి నివాస్ నుంచి ప్రారంభమై తిరిగి రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ టూర్ లో పెద్దవారికి రూ.2800, పిల్లలకు రూ.2240 ప్యాకేజిగా నిర్ణయించారు. పిల్లలకు 2,240గా నిర్ణయించారు. వివరాలు https:// tourism.telangana.gov.in లో తెలుసుకోవచ్చు
………………………………………….