ఆకేరున్యూస్, హైదరాబాద్: కొంత కాలంగా నెలకొన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల ఉత్కంఠకు తెర పడనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా.. స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్ల పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఈ రోజు స్పీకర్ కార్యాలయంలో ఈ కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫు అడ్వకేట్లు, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరుకానున్నారు.
………………………………………………………
