
* సంస్కరణల అమలుకు తాపత్రయపడేవారు
* పీవీ నరసింహారావు తర్వాత అంతపేరు ఆయనకే
* రాజకీయాల్లో అజాత శత్రువు
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు జైపాల్ రెడ్డి అజాతశత్రువుగా ఉన్నారని, సిద్ధాంతపరంగా మాత్రమే ఆయనకు ఇతరులతో విభేదాలు ఉండేవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఐసీ ఎఫ్ఏఐ నిర్వహించిన ఎస్.జైపాల్ రెడ్డి స్మారక అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రముఖ ఆర్థిక నిపుణులు మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి డెమోక్రసీ తొలి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సమాచారహక్కు చట్టం రావడంలో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. సంస్కరణల అమలుకు కూడా జైపాల్ రెడ్డి ఎంతో తాపత్రయం పడేవారని తెలిపారు. పీవీ నరసింహారావు తర్వాత అంతపేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమే అన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారని అన్నారు. వ్యక్తిగత రాజకీయాల కంటే, సిద్ధాంతపరమైన రాజకీయాలు ముఖ్యమన్నారు. జైపాల్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని మేం ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆయన లేకుంటే ప్రత్యేక తెలంగాణ కల కూడా సాకారం అయ్యేది కాదని రేవంత్ వెల్లడించారు. ఆయన సహకారం తెలంగాణస్ఫూర్తి ఎంతో పనికొచ్చిందన్నారు. కల్వకుర్తి ప్రాంత అభివృద్ధిలో ఆయన ముద్ర ఉందన్నారు.
………………………………………..