
* తెలంగాణ ప్రభుత్వానికి, ఈసీకి హైకోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించి రీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ న్యాయవాది సురేందర్ (Advocate Surender) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఈసీని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుందని ఇందుకు రెండు వారాల సమయం కావాలని ఈసీ కోరింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లాలని తెలిపినట్టు ఈసీకి కోర్టు గుర్తుచేసింది. ఎన్నికలు పెట్టుకోవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది కానీ.. కోర్టు ఆర్డర్స్ కాపీలో ఎక్కడా లేదని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశామని.. ఈ విషయంపై గురువారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వంతో చర్చించిన తరవాతే రీ నోటిఫికేషన్ ఉంటుందని.. ఇందుకోసం తమకు 2 వారాల సమయం కావాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు (High Court) తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
………………………………………