ఆకేరు న్యూస్, కమలాపూర్ : అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి రాజయ్య కుమారుడు బండి వంశీ గత సంవత్సరం అమెరికాలో కాంకోర్డియా సెయింట్ పాల్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ చదివేందుకు వెళ్ళాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం….మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రేరీ, ఆప్ట్ 206, నివాసం ఉంటున్నాడు.ఈ శనివారం రాత్రి తాను ఉంటున్న అపార్ట్మెంట్ కింద సెల్లార్లో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయం ఆదివారం ఫోన్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిoచారు. ప్రభుత్వపరంగా వీలైనంత తొందరగా మృతదేహం రప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
…………………………………………………….