
* ఉద్యోగ్ర భద్రత కల్పించాలంటూ పార్ట్‌టైం అధ్యాపకుల ఆందోళన
ఆకేరున్యూస్, హైదరాబాద్: సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్‌టైం అధ్యాపకులు సెక్రటేరియట్‌ను ముట్టడిరచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్ట్‌టైం లెక్చరర్లకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం వారిని వానుల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో 900 మంది పార్ట్‌టైం అధ్యాపకులు ఉన్నారని, జీవో 21 ప్రకారం రెగ్యులర్ అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తే తమ ఉద్యోగాలు పోతాయన్నారు. దీంతో తమ కుటుంబాలు రోడ్డుపాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అధ్యాపక నియామకాల్లో పార్ట్ టైం అధ్యాపకులకు ప్రథమ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. జీవో 21కి వ్యతిరేకంగా పార్ట్ టైమ్ అధ్యాపకులు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
…………………………………….