* రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు
* ప్రిన్సిపల్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు
ఆకేరు న్యూస్, రంగారెడ్డి :
షాద్‌నగర్‌లో టెన్షన్ నెలకొంది. ప్రిన్సిపాల్ వేధింపులతో విద్యార్థినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ శైలజ తమను వేదిస్తున్నారని, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినులు చేస్తున్న ధర్నాను అడ్దకున్నారు. దీంతో విద్యార్థినులు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై విద్యార్థినులు దాడి చేశారు. న్యాయం చేయాలని రోడ్డుపైకి వచ్చిన తమనే కొడతారా? అని విద్యార్థినులు పోలీసులను ప్రశ్నించారు. తీవ్ర ఘర్షణలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని విద్యార్థినులు తేల్చిచెప్పారు. పరిస్థితులను అదుపు చేసేందుకు కొంతమంది విద్యార్థినులను పోలీసుల బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఇదేనా.. ఇందిరమ్మ పాలనలో అమ్మాయిలకు న్యాయం..
బీఆర్ ఎస్ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్..
ఇదేనా ఇందిరమ్మ పాలనలో అమ్మాయిలకు అందుతున్న న్యాయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ ఎస్ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. షాద్‌నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై తీవ్రంగా స్పందించారు. మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులపై దాడి చేయడాన్ని ఖండించారు. విద్యార్థినులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించడం దారుణమన్నారు. మహిళల గురించి కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. జూబ్లిహిల్స్‌లో మహిళలే మిమ్మల్ని ఓడించి, బుద్ధి చెబుతారన్నారు.
…………………………………………
