
* విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసనలు
*రామంతాపూర్ ప్రమాదంపై స్థానికుల ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని ఉప్పల్ (Uppal) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామంతాపూర్లో కృష్ణాష్టమి వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి.. ఐదుగురు దుర్మరణం చెందడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎండీ(CMD)ని స్థానికులు చుట్టుముట్టారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే తీవ్ర విషాదం చోటుచేసుకుందని నిరసన వ్యక్తం చేశారు. ఐదుగురి ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డౌన్ డౌన్ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గుమిగూడిన ప్రజలను చెదరగొట్టారు. ఉద్రిక్త వాతావరణం చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు (Enquiry) చేస్తున్నారు. రథం ఎత్తు ఎంత.. వైర్లు వేలాడుతున్నాయా.. వాటికి కరెంటు ఎలా సరఫరా అయింది.. అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
………………………………