
* చైనా సహకారం ఎవరికి?
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ప్రపంచ దేశాలు కూడా దీనిపై స్పందిస్తున్నాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండూ ఒకరికొకరు పొరుగు దేశాలు, ఆ ఇద్దరూ చైనా(Chaina)కు పొరుగువారంటూ చైనా ప్రకటించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత ప్రయోజనాల కోసం శాంతి మార్గం అనుసరించాలని ఇరు దేశాలకూ సూచించింది. UN చార్టర్ సహా అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని వివరించింది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి, నిర్మాణాత్మక పాత్ర పోషించానికి, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.
………………………………………….