
* భద్రతా దళాల అధీనంలో ఆ ప్రాంతం
* జమ్ము కశ్మీర్ చేరుకున్న అమిత్ షా
ఆకేరు న్యూస్, డెస్క్ : జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో జరిగిన ఉగ్రదాడిపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. శ్రీనగర్ చేరుకున్న ఎన్ ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amithsha)కూడా అక్కడకు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతదేహాలను స్వస్థాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పహల్గాంగలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. అక్కడకు వెళ్లడంపై అధికారులు ఆంక్షలు విధించారు. పహల్గా మార్గాల్లో భద్రతా అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అ ఈఘటనతో పర్యాటకులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే అక్కడ ఉన్న వారు కూడా హోటళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఇండిగో సంస్థ పర్యాటకులకు వెసులుబాటు కల్పించింది. విమాన టికెట్లు రీ షెడ్యూల్, క్యాన్సలేషన్ చార్జీలను రద్దు చేసింది. కాగా ఉగ్రవాడిలో హైదరాబాద్(Hyderabad)కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా మృతిచెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చిచంపినట్లుగా తెలుస్తోంది.
……………………………………………