
* జమ్ముకశ్మీర్లో కాల్పుల కలకలం
* ఒకరి మృతి.. పది మందికి గాయాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : జమ్ము కశ్మీర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు (Terrorist Attack) తెగబడ్డారు. ఈ కాల్పల్లో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఒకరు మృతి చెందారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్(pahalgam)లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పహల్గామ్లో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే అమర్నాథ్ (Amarnath)యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది.
…………………………………………….